Sports

సుప్రీం  కోర్ట్ లో  బిసిసిఐ అఫిడవిట్  దాఖాలు 

- సుప్రీంలో దాఖలు చేయనున్న బీసీసీఐ
ముంబయి : బీసీసీఐ ప్రక్షాళనకు జస్టిస్‌ లోధా కమిటీ సూచించిన సిఫార్సుల అమలులో ఇబ్బందులను ఏకరువు పెడుతూ.. సుప్రీంకోర్టులో క్రికెట్‌ బోర్డు అఫిడవిట్‌ దాఖలు చేయనుంది. 200 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్‌ను మార్చి 3లోగా అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు, ప్రతి పదవీ కాలానికి మధ్య మూడేండ్ల విరామం, గరిష్ట వయో పరిమితి వంటి నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న బోర్డు సభ్యులు..అఫిడవిట్‌లో అమలులో ఎదురేయ్యే ఇబ్బందులను సవివరంగా వివరించినట్టు తెలుస్తోంది. క్రికెట్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసార సమయంలో ఓవర్‌కు, ఓవర్‌కు మధ్య విరామంలో ప్రకటనలను ఆపేయాలని సూచించడం పట్ల బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలా చేస్తే ప్రస్తుతం రాష్ట్రాల అసోసియేషన్‌లకు ఏడాదికి ఇస్తున్న నిధులు రూ. 25 కోట్ల స్థానంలో కేవలం రూ. 2 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి వుంటుందని అఫిడవిట్‌లో పేర్కొంది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సి ల్‌లో ప్రాంఛైజీ యాజమాన్యాలకు చోటు ఇవ్వటం పట్ల కూడా బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి పదవి కాలానికి మూడేండ్ల విరామం ఉంటే.. ఉత్తమ పరిపాల కులను తిరిగి ఎన్నుకునే అవకాశం కోల్పోతామని అఫిడవిట్‌లో పొందుపరిచినట్టు సమాచారం.

లంకను   జయించారు


Image result for bangla team CRICKETమీర్పూర్ : ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఆదివారిమిక్కడ జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లా 23 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. 148 పరుగుల లక్షఛేదనకు దిగిన శ్రీలంక.. బంగ్లా బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. జట్టులో చండిమాల్(37), జయసురియా(26) మాత్రమే రాణించారు. ఆల్‌అమిన్‌కు మూడు, షకిబ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా.. షబ్బీర్‌రెహ్మన్(80), షకిబ్(32), మహ్ముదుల్లా(23 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.చండిమాల్ మెరిసినా.. : కష్టసాధ్యం కాని ఛేదనకు దిగిన శ్రీలంక త్వరగానే ఓపెనర్ దిల్షాన్(12) వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ చండిమాల్(37), జయసురియా(26) జట్టును గెలిపించేందుకు ప్రయత్నించారు. ఇద్దరు ఆడపాదడపా బౌండరీలు బాదుతూనే వికెట్ల మధ్య వేగంగా కదలడంతో పది ఓవర్లు ముగిసే సరికి లంక 66/1తో నిలిచింది. అయితే క్రీజులో కుదురుకున్న జయసురియా, చండిమాల్‌ను మూడు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చారు బంగ్లా స్పిన్నర్లు. మొదట మహ్ముదుల్లా బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్ ప్రయత్నించిన చండిమాల్.. టస్కిన్‌కు సునాయాస క్యాచ్ ఇవ్వగా, మరో మూడు బంతులకే జయసురియా షకిబ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఇక తరువాత క్రీజులోకి వచ్చిన పెరీర(4), సిరివర్ధన(3), మాథ్యూస్(12), శనక(14) నిరశపర్చడంతో పూర్తి ఓవర్లలో 124 పరుగులకే పరిమితమైంది.రాణించిన సబ్బీర్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మిథూన్(0), సౌమ్యసర్కార్(0) ఖాతా తెరవకుండానే వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్పీకర్(4) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలబడకపోవడంతో 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ సబ్బీర్‌రెహ్మాన్(80) జట్టును ఆదుకున్నాడు. లంక బౌలర్లపై ఎదురుదాడి చేసిన సబ్బీర్ ఆల్‌రౌండర్ షకిబ్(32)తో 82 పరుగులు జోడించి జట్టుస్కోరును వంద పరుగుల మార్కు దాటించాడు. అయితే సబ్బీర్, షకిబ్ స్వల్ప వ్యవధిలో అవుటైనా చివర్లో మహ్ముదుల్లా(23 నాటౌట్) రాణించడంతో 147 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.
ఆ ఒక్క స్థానం కోసం 4 జట్లువిూర్పూర్‌ స్పొర్ట్స్‌,ఫిబ్రవరి  (ఎ.ఎం.ఎస్‌) : ఆసియా కప్‌ సమరానికి నేడు తెరలేవనుంది. బంగ్లాదేశ్‌ వేదికగా తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న ఆసియాకప్‌.. నేడు అర్హత రౌండ్‌తో ఆరంభం కానుంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ సహా భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌లు ప్రధాన టోర్నీకి నేరుగా అర్హత సాధించగా... అఫ్ఘనిస్తాన్‌, హాంగ్‌కాంగ్‌, యు.ఏ.ఈ, ఓమెన్‌లు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో అదృష్టం పరీక్షించుకోనున్నాయి. రౌండ్‌ రాబిన్‌ పదతిలో జరిగే క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో విజేతగా నిలిచిన జట్టు ప్రధాన టోర్నీకి అర్హత సాధించనుంది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌ తొలి మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్‌, యు.ఏ.ఈలు తలపడనున్నాయి. ప్రధాన టోర్నీ 24న బంగ్లాదేశ్‌, భారత్‌ మ్యాచ్‌లో ప్రారంభం కానుంది.
లంక పగ్గాలు మలింగకే.. 


శ్రీలంక : ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌కప్‌లకు శ్రీలంక జట్టును గురువారం ప్రకటించారు. గాయంతో భారత్‌తో పొట్టి సిరీస్‌కు దూరమైన స్టార్‌ సీమర్‌ లసిత్‌ మలింగ, ఎంజెలో మాథ్యూస్‌, నువాన్‌ కులశేఖరలు ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి జట్టులోకి వచ్చారు. రెండు ప్రతిష్టాత్మక టోర్నీల సారథ్య బాధ్యతలు లసిత మలింగకు అప్పగించారు. భారత్‌తో సిరీస్‌లో కళ్లుచెదిరే ఆరంగ్రేటం చేసిన యువ పేసర్‌ కసున్‌ రజిత.. జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
------------------------------------------------------------------------------------------------------------
భయమెరుగని బృందం!
 -  బ్యాటింగ్‌ ఆర్డర్‌పై రోహిత్‌ వ్యాఖ్య

ముంబయి స్పొర్ట్స్‌,ఫిబ్రవరి (ఎ.ఎం.ఎస్‌) : ప్రస్తుత టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ భయమెరుగని బృందమని రోహిత్‌ శర్మ పేర్కొ న్నాడు. ' భయం లేని బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఇది. కొన్ని సార్లు వ్యుహం ఫలిస్తుంది, కొన్ని సార్లు విఫలం కావచ్చు. ఇది మితివిూరిన ఆత్మ విశ్వాసం ఏమాత్రం కాదు. బయటివ్యక్తులు సరైన కోణంలో చూడాల్సిన అవసరం వుంది' అని రోహిత్‌ అన్నాడు. టీమ్‌ డైరెక్డర్‌ రవిశాస్త్రి, సహాయ కోచ్‌ సంజరు బంగర్‌లు జట్టులో ఎంతో మార్పు తీసుకొచ్చారు, అందరూ ఒకే సమాకాలిన వయసు వారేమే కావటంతో ప్రాక్టీస్‌ సెషన్లలో మనస్ఫూర్తిగా గడుపుతున్నాం. ఆరంభంతో పోల్చితే ఇప్పుడు భారీ స్కోర్లు చేయగల్గుతున్నాను. దీనికి అనుభవం ఓ కారణమైతే.. ఐపీఎల్‌లో ముంబయికి ఇండియన్స్‌కు కెప్టెన్సీ వహించటం మరో కారణం. సహజ ప్రతభ ఎంతున్నా.. కష్టపడనిదే ఎదీ దక్కదు అని రోహిత్‌ తెలిపాడు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

 --------------------------------------------- - --------------------------------------------         ----------
మ్కా బుక్‌కు సచిన్‌ పుస్తకం న్యూఢిల్లీ స్పొర్ట్స్‌,ఫిబ్రవరి  (ఎ.ఎం.ఎస్‌) : క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నా.. మాస్టర్‌ బ్లాస్టర్‌ రికార్డులు ఆగటం లేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ తొలినాళ్లలో విడుదలైన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆత్మకథ పుసక్తం ' ప్లేయింగ్‌ ఇట్‌ మై వే' లిమ్కా బుక్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌ విభాగాల్లో కలిపి అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు ప్లేయింగ్‌ ఇట్‌ మై వేను గుర్తించారు. నవంబర్‌6, 2014న మార్కెట్‌లోకి విడుదలైన ఈ పుస్తకం ఇప్పటివరకూ 1,50,289 కాపీలు అమ్ముడుపోయింది. దీని ద్వారా రూ. 13.51 కోట్ల రూపాయలు సైతం లభించాయి. ఐతే ప్రాథమికంగా ఈ పుస్తకం ఆంగ్ల వెర్షన్‌లో విడుదలైంది, ప్రాంతీయ బాషల్లో త్వరలో మార్కెట్‌లోకి రావాల్సి వుంది. ప్రాంతీయ బాషల్లోనూ అందుబాటులోకి వస్తే పుస్తకం అమ్మకాలు మరింత పెరిగే అవకాశముంది.
------------------------------------------------------------------------------------------------------------                          
ప్రతిఘటన వ్యూహం..!

  HYDERABAD NEWS TODAY :-బీసీసీఐ సమూల ప్రక్షాళనకు జస్టిస్‌ లోధా కమిటీ సూచించిన సిఫార్సులపై సవివరంగా చర్చించేందుకు నేడు బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసింది. లోధా సిఫార్సులను యథాతథంగా అమలుచేస్తే.. ఏండ్లుగా క్రికెట్‌ సంఘాల్లో పాతుకుపోయిన వారి కుర్చీకి ఎసరు రానుండటంతో.. బోర్డులో మెజార్టీ సభ్యులు కమిటీ సూచనలను వ్యతిరేకిస్తున్నారు. మార్చి 3న  ప్రీంకోర్టుకు తన అభిప్రాయం తెలపాల్సిన నేపథ్యంలో.. నేడు జరిగే ఎస్‌జీఎంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది.
------------------------------------------------------------------------------------------------------------
-లోధా సిఫార్సులపై చర్చకు రంగం సిద్ధం -బీసీసీఐ ప్రత్యేక సర్వ  సభ్య సమావేశం నేడు
 ముంబయి స్పొర్ట్స్‌,ఫిబ్రవరి 19 (ఎ.ఎం.ఎస్‌) : 'న్యాయకోవిదులు రూపొందించిన సిఫార్సులు అత్యంత సూటిగా, హేతుబద్ధంగా, అర్థవంతంగా ఉన్నాయి. సిఫార్సులను వ్యతిరేకించడానికి కారణాలేవిూ లేవు. మరి విూరే (బీసీసీఐ) స్వయంగా అమలు చేస్తారా.. లేదంటే మళ్లీ కమిటీనే అమలు కోసం రంగంలోకి దించాలా?' స్ఫాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇటీవల విచారణ సందర్భంగా బీసీసీఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో చూపిన ప్రత్యేక చొరవ దృష్ట్యా.. బోర్డుకు అమలు మార్గం తప్ప మరో దారి లేదని భావించినా వ్యతిరేకత వ్యక్తం చేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రాల అసోసియేషన్లను ఇప్పటికే ఈ విషయంలో చర్చించాల్సిందిగా కోరిన బీసీసీఐ.. నేడు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. లోధా సిఫార్సులపై ఇప్పటికే శరద్‌ పవార్‌ సారథ్యంలోని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌, కళింకిత డీడీసీఏ సహా చాలా సంఘాలు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశాయి. మరికొన్ని సంఘాలు కొన్ని అంశాల్లో తమ సూచనలు, సలహాలను వెల్లడించాయి. బయటకు చెప్పకపోయినా బీసీసీఐ పెద్దలు సిఫార్సుల అమలుకు ఏ మాత్రం సుముఖంగా లేరని సమాచారం. వ్యక్తిగతంగా బయటపడని బీసీసీఐ బాస్‌ శశాంక్‌ మనోహర్‌, కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌లు... నేటి ఏస్‌జీఎం ద్వారా వ్యతిరేక సంకేతాలు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. సహజంగా బీసీసీఐ సిఫార్సుల్లో ఏమైనా వ్యతికించదలిస్తే.. అది కేవలం ఒక్క బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించటంపైనే. ఎందుకంటే ప్రస్తుతం బోర్డు ఎదుర్కొంటున్న విపరీత పరిస్థితులకు మూలం బెట్టింగ్‌ చేయటమే. కానీ అందుకు భిన్నంగా మంత్రులు, ప్రభుత్వాధికారులను పదవులకు అనర్హులు చేయటం, బోర్డును సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావటం సహా ఒక వ్యక్తి రెండు పదవి కాలాలకు మధ్య మూడేండ్ల విరామం ఉండాలనే సిఫార్సులను బోర్డు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టులో మాత్రం అమలు విషయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, బీసీసీఐ రిజిస్ట్రేషన్‌ ప్రకారం తలెత్తె పరిణామాలు వంటి కుంటి సాకులు వల్లే వేస్తోంది. ఇక ఒక రాష్ట్రానికి ఒకే ఓటు (బీసీసీఐ ఎన్నికల్లో) సైతం సభ్య సంఘాలకు రుచించటం లేదు. బీసీసీఐకి నడిపిస్తోన్న మహారాష్ట్ర, గుజరాత్‌లను ఇది ప్రధానంగా ప్రభావితం చేయనుంది. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌, మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌, విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ రూపంలో మహారాష్ట్రలో మూడు సంఘాలున్నాయి. బీసీసీఐ బాస్‌ శశంక్‌ మనోహర్‌, కాబోయే ఐసీసీ ఛైర్మన్‌ శరద్‌ పవార్‌, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ అజరు షిర్కేలు ఈ మూడు సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే వీటిలో ఒక సంఘానికే ఓటు హక్కు లభిస్తుంది. ఇక ప్రస్తుతం బోర్డులో కీలక పదవుల్లో ఉన్నవారు వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి సైతం వీల్లేదు. ఎందుకంటే రెండు పదవి కాలాలకు మధ్య మూడేండ్ల విరామం నిబంధన. దీంతో బోర్డుపై బడా నేతలు పట్టు కోల్పోతారు. ఇవన్ని ఆలోచించిన బీసీసీఐ పెద్దలు..ఎస్‌జీఎం ద్వారా సిఫార్సులపై వ్యతిరేక స్వరం వినిపించాలని రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సమావేశం అనంతరం జరిగే వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయాలకు తుది ఆమోద ముద్ర వేయనున్నారు.
వ్యతిరేకిస్తున్న సిఫార్సులివే..
1. ఒక రాష్ట్రం.. ఒక ఓటు
2. బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావటం
3. బోర్డు పదవికి గరిష్ట వయో పరిమితి
4. రెండు పదవి కాలాలకు మధ్య విరామ నిబంధన
5. మంత్రులు, ప్రభుత్వాధికారులు బోర్డు పదవులకు అనర్హులు
6. మ్యాచ్‌లో ఓవర్ల మధ్య ప్రసారాలకు బ్రేక్‌
------------------------------------------------------------------------------------------------------------

 ఆసియా కప్‌ క్వార్టర్స్‌లోకి భారత్‌

- 5-0తో సింగపూర్‌పై విజయం

                         హైదరాబాద్‌ : బ్యాడ్మింటన్‌ ఆసియా కప్‌ పోటీల్లో భారత అభిమానులకు శుభవార్త. చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురవుడంతో క్లిష్ట స్థితికి చేరిన భారత్‌ జట్టు ఆ స్థితిని అధిగ మించింది. బుధవారం సింగపూర్‌ జట్టును 5-0 తేడాతో ఓడించడంతో క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి అడు గిడింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు సమిష్టిగా రానించారు. కిడాంబి శ్రీకాంత్‌ 21-16, 12-21, 21-13 పాయింట్లతో జి లియాంగ్‌ డెరెక్‌ పై విజయం సాధించాడు. గచ్చిబౌళిస్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వడానికి సింగపూర్‌ ఆటగాడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌కు చెందిన ప్రపంచ 9 వ ర్యాంకు క్రీడాకారుడైన శ్రీకాంత్‌ రెండవ రౌండ్‌లో తక్కువ స్కోర్‌ చేసినప్పటికీ, కీలకమైన చివరి రౌండ్‌లో సత్తా చూపాడు. స్పష్ట మైన ఆధిక్యత సాధించాడు. రెండవ సింగిల్‌ మ్యా చ్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. అజరు జయరామ్‌ సింగపూర్‌ క్రీడాకారుడు కీన్‌యూపై వరుస సెట్లలో ఆధిక్యత సాధించి విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో 21-11, రెండవ రౌండ్‌లో 21-18 స్కోర్‌ను అజరు జయరామ్‌ చేశాడు. డబుల్స్‌ విభాగంలోనూ భారత జట్టుకు ఎదురు లేకుండా పోయింది. భారత డబుల్స్‌ క్రీడాకారులు పూర్తి స్థాయిలో రాణించడంతో సింగపూర్‌ జట్టు ఏ దశ లోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత్‌కు చెందిన మను ఆత్రి, సువిూత్‌రెడ్డి 21-15, 21-14 స్కొర్లతో తొలి డబుల్స్‌లో విజయం సాధించారు. సెకండ్‌ డబుల్‌ మ్యాచ్‌లో ప్రణవ్‌ జెర్రి చోప్రా, అక్షరు దేవాల్కర్‌ 21-14, 21-13 స్కోర్‌తో సింగపూర్‌ క్రీడాకారులు డాన్‌బానే క్రిస్టియానా జంటపై పై చేయి సాధించారు. 27వ ర్యాంకు క్రీడాకారుడు ప్రణరుకూడా సింగిల్స్‌ మ్యాచ్‌లో సింగపూర్‌ క్రీడాకారునిపై 21క్ష్మి10, 21-12 స్కోర్‌తో విజయం సాధించాడు. భారత జట్టు తిరిగి పుంజుకోవడం పట్ల చీప్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ హర్షం వ్యక్తం చేశారు. 'ఇది మంచి విజయం. 5-0తో విజయం సాధించడం మంచి పరిణామం. మిగిలిన పోటీల్లోనూ ఇదే విధంగా రాణించాలి' అని ఆయన అన్నారు.

No comments:

Post a Comment