వుదయం VOODAYAM Telugu Daily

Tabs

  • వార్తలు ↓
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
  • సినిమా
  • బిజినెస్
  • క్రీడలు
  • అక్సా (హెల్త్)
  • తెలంగాణ ↓
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్ నగర్
    • మెదక్
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగా రెడ్డి
  • ఆంధ్రప్రదేశ్ ↓
    • గుంటూరు
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • కృష్ణ
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • అనంతపురం
    • కడప
    • చిత్తూరు
  • Calendars ↓
    • Calendar 2013
    • Calendar 2014
    • Calendar 2015
    • Calendar 2016
    • Calendars 2017
    • Calendars 2018
    • Calendars 2019
    • Calendars 2020
    • Calendars 2021
  • E-PAPER↓
    • Hyderabad Edition
    • Adilabad Edition
    • Khammam Edition
    • Karimnagar Edition
    • Guntur Edition
    • Warangal Edition
  • Login
  • ContactUs

Rangareddy

బాల్య వివాహాన్ని అడ్డుకున్న తహశీల్దార్

మోమిన్‌పేట, ఫిబ్రవరి  స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న తహశీల్దార్ విజయకుమారి- సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం అడ్డుకున్నారు. నవాబ్‌పేట మండలం- కుమ్మరిగూడేనికి చెందిన బాలికతో, మోమిన్‌పేట వరునికి వివాహం చేస్తున్నారు. వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని ఆపివేసారు. అమ్మాయిని శిశువిహార్‌కు తరలించి చదివించడానికి ఒప్పించామని, అమ్మాయి విద్యార్హత ధ్రువ పత్రాలను 24 గంటల్లో సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఇకముందు ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్యవివాహాలు చేసే వారికి జరిమానా, శిక్ష విధించబడుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో సిడిపిఓ వరలక్ష్మి, ఎస్‌ఐ రాజు, ఆర్‌ఐ, విఆర్‌ఓలు పాల్గొన్నారు.

పార్టీల  అద్యక్ష పదవులు ఖాళీ 



ఆ మూడు ప్రధాన పార్టీలకూ జిల్లా అధ్యక్షులు కరవయ్యారు. మూడూ జాతీయ పార్టీలే. జిల్లాలో చుక్కాని లేని నావలా ఆ పార్టీల కార్యక్రమాలు కొనసాగుతుండడం గమనార్హం. వివిధ కారణాలతో జాతీయ పార్టీ లైన కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలకు జిల్లా అధ్య క్షులు కరవయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు వరసపెట్టి అధికార పార్టీలో చేరిపోయారు. బీజేపీ నాలుగు నెలలుగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నది. కాంగ్రెస్‌ ఎవరిని అధ్యక్షుడిని చేయాలో తేల్చకోలేకుండా ఉన్నది. దీంతో ఆయా పార్టీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనున్నది.   రంగారెడ్డిలో ఎన్నికలకు ముందు ప్రస్తుత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడిగా ఉండి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి గతేడాది పార్టీని వీడి అధికార పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత అధ్యక్షుడైన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ ఇటీవలే అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పునకు వ్యతిరేకంగా పాదయాత్ర సైతం నిర్వహించారు. తన నియోజకవర్గంలో మార్చి 1న బహిరంగ సభ నిర్వహించి, టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. దీంతో మరోసారి జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ అయింది. జిల్లాలో ఈ స్థానం కోసం అయిదారుగురు పోటీ పడుతున్నారు. ప్రస్తుత జిల్లా కార్యదర్శి సుభాష్‌యాదవ్‌తోపాటు నాయకులు భూపాల్‌రెడ్డి, సామరంగారెడ్డి తదితరులు పోటీపడుతున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను పార్టీ అధినేత చంద్రబా బునాయుడుపై పెట్టారు. మార్చి 5 తర్వాత బడ్జెట్‌ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు హైదరా బాద్‌లో ఉంటారని, అప్పుడే జిల్లా అధ్యక్షుడిని, వివిధ నియోజ కవర్గాల ఇన్‌చార్జిలను ప్రకటించే అవకాశం ఉన్నది.
  కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఎవరిని అధ్యక్షుడిగా నియమించుకోవాలో తెలియని పరిస్థితిలో నాయకత్వం ఉన్నది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న క్యామమల్లేష్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగి నెలరోజులైనా కొత్త అధ్యక్షుడిని పార్టీ ప్రకటించలేదు. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేల్లో చాలామంది క్యామమల్లేష్‌ అధ్యక్షుడిగా ఉండాలని అధిష్టానానికి లేఖలు రాశారు. కాగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజరుసింగ్‌ మాత్రం మాజీమంత్రి అయిన డాక్టర్‌ కె.చంద్రశేఖర్‌ పేరును సూచించినట్టు తెలిసింది. అయితే కొత్త అధ్యక్షుడిని నియమించడంగానీ, ఉన్న అధ్యక్షుడి విషయంలో నిర్ణయం తీసుకోవడంలోగానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు.
బీజేపీ కూడా కొత్త అధ్యక్షుడి విషయాన్ని నాలుగు నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్నది. ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల కాలపరిమితి పూర్తయింది. నవంబర్‌లోనే సంస్థాగత ఎన్నికలు ముగి యాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నాలుగు నెలలుగా కొనసా గుతూనే ఉన్నది. దీంతో జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం కాలేదు. జిల్లాలో ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కానీ జిల్లాలో వామపక్షాలు మినహా రాజకీయ పార్టీల భాగస్వామ్యం లేకుండా పోతున్నది. ఆయాన పార్టీలకు జిల్లా సారథులు లేకపో వడంతో ప్రజాసమస్యలపై కార్యాచరణ ప్రణా ళికను రూపొందించలేకపోతున్నారు. ఆ పార్టీలు జిల్లా బాధ్యులను నియమించుకుని ఎప్పుడు గాడిలో పడతాయో వేచిచూడాల్సిందే.

దరఖాస్తుదారులకు 'డబుల్‌' కష్టాల





 : పేదలతో అధికారుల బంతాట
- ఇప్పటికే రూ.25 లక్షల నష్టం

దరఖాస్తు ప్రతి కోసం జిరాక్స్‌ సెంటర్‌లో పడిగాపులు.. కిలోమీటర్‌ పొడవునా క్యూలైన్లు.. ఎన్నో వ్యయ ప్రయాసలు.. వెరసి చివరికి దరఖాస్తును అధికారి చేతిలో పెట్టారు. ఇలా వేలాది మంది దగ్గర దరఖాస్తులు స్వీకరించిన రంగారెడ్డి జిల్లా అధికారగణం తిరిగి ఆన్‌లైన్‌ అప్లికేషన్లను ఆహ్వానించారు. దీంతో దరఖాస్తుదారులు ఉసూరుమంటున్నారు. వారం రోజులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో వేలాది మంది డబుల్‌ బెడ్‌రూమ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకున్న తరువాత మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తమతో బంతాట ఆడుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌ దరఖాస్తులను కలెక్టరేట్‌లో గుట్టలుగా పేర్చారు. హైదరాబాద్‌కు చెందిన వారూ సుమారు 30వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. రెండు జిల్లాల్లో ఈ లెక్కన చూస్తే దరఖాస్తులు లక్షన్నర దాటినట్టు తెలుస్తున్నది.
విధివిధానాలు రూపొందించని ప్రభుత్వం
లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ల ఇండ్ల విషయమై ప్రభుత్వం జీవో జారీ చేయకపోయినా, లబ్దిదారుల ఎంపికకు విధివిధానాలు రూపొందించకున్నా వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 24 నియోజకవర్గాలున్నాయి. సీఎం ప్రకటించిన లక్ష ఇండ్లను పంచితే ఒక్క నియోజకవర్గానికి 4,500 ఇండ్లైనా రావు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో 2,400 ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయి. లక్ష ఇండ్ల ప్రస్తావనే రాలేదు. మంజూరైన ఇండ్లకూ లబ్దిదారుల ఎంపికే జరగలేదు. ఇండ్లు కట్టించి లబ్దిదారులను ఎంపిక చేస్తారా? లేక లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్లు కట్టిస్తారా? అన్న విషయం తేల్చాల్సి ఉంది. ఇప్పటి వరకూ రంగారెడ్డి జిల్లాలో మురికవాడల ఎంపికే జరగలేదు. మొదటి దశలో మురికివాడల్లో ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఐదు మురికివాడలను మాత్రమే గుర్తించారు. కూకట్‌పల్లిలో రెండు చోట్ల, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌లలో శంకుస్థాపన చేశారు. ఈ మురికివాడలకు మంజూరైంది 2,400 ఇండ్లు మాత్రమే.
గందరగోళ నిర్ణయాలతో ప్రజల అవస్థలు
రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో అలసత్వం వహించడం వల్లే దరఖాస్తుదారులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. సమగ్ర ప్రణాళిక లేకపోవడంతో రూపొందించిన అప్లికేషన్లను 10 రూపాయలకు ఒకటి చొప్పున కొని, దానికి ఆధార్‌కార్డు, ఆహారభద్రతా కార్డు, తాము కిరాయి ఇంట్లో ఉంటున్నామన్న వివరాలను జతపరుస్తూ సుమారు లక్షన్నరకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది అక్కడ బ్రోకర్ల మాదిరిగా తయారై ఫారమ్‌లు నింపి ఇచ్చినందుకు 10 రూపాయల చొప్పున వసూలు చేశారు. దరఖాస్తుదారుల్లో 80 శాతం వరకూ మహిళలే ఉన్నారు. ఒక్కొక్క దరఖాస్తుకు సగటున 25 రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది. ఈ ప్రకారం కనీసం దరఖాస్తుదారులు కనీసం రూ.25 లక్షలు ఖర్చు చేసినట్టు అంచనా. విధిలేని పరిస్థితుల్లో జిల్లా సిబ్బంది ఈ దరఖాస్తులను స్వీకరించి, రశీదులనూ ఇచ్చింది. ఇన్ని దరఖాస్తులను స్వీకరించిన యంత్రాంగం వాటికి ఏ విధంగా జవాబుదారీగా ఉంటుందో తెలియని పరిస్థితి.
మినీ మేడారం జాతర...
గత వారమంతా కలెక్టరేట్‌ మినీ మేడారం జాతరను తలపించింది. వేలాదిమంది దరఖాస్తులు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు 7,500 దరఖాస్తులు, ఎన్నికలు ముగిసిన తరువాత 2,900, ఈ నెల 15వ తేదీ నుంచి ఇబ్బడిముబ్బడిగా అప్లికేషన్లు వచ్చాయి. 15న 6,900, 16న 6,615, 17న 10,040, 18న 13,840, 19న 21,078, 20న 17,201 దరఖాస్తులు కుప్పలుగా చేరాయి. ఆరు రోజుల కాలంలోనే 75,674 దరఖాస్తులు ఇచ్చారు. ఇక్కడ జనాలను చూసి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన జనం కొంతమంది వెనుదిరిగారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేదాకా ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దని, కలెక్టరేట్‌ కార్యాలయానికి రావొద్దని అధికారులు వారించినా ప్రజలు వినిపించుకోలేదు. 10 రోజులుగా దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చివరకు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ రంగంలోకి దిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. వేలాది మందిని నియంత్రించలేక ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో 15 కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజలకు అర్థం చేయించడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమైంది. దరఖాస్తులు తీసుకోవడం మానేస్తే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఇప్పుడేమో మళ్లీ రూ.25 చెల్లించి సోమవారం నుండి ఈ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో మరోసారి దరఖాస్తు చేసుకోమని చెబుతోంది.
Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Home
Subscribe to: Posts (Atom)

Covid-19 Live Map

Covid-19 Live Map

AMS (Ashish Media Services)

AMS (Ashish Media Services)
Ashish Media Services

Visited Countries

Flag Counter

Anu Marriage Beuro

Anu Marriage Beuro

Abhishek Enterprises

Abhishek Enterprises

RSJThomas - International Photo Journalist

RSJThomas - International Photo Journalist
Press Information Bureau

QR Code of Voodayam

qr code

Apply Soon...

Apply Soon...

Select E-paper (Note: Only press on these arrows '►' '▼' below)

  • ▼  2016 (326)
    • ▼  January (26)
      • 1-1-2016 e-paper
      • 2-1-2016 e-paper
      • 3-1-2016 e-paper
      • 5-1-2016 e-paper
      • 7-1-2016 e-paper
      • 8-1-2016 e-paper
      • 9-1-2016 e-paper
      • 6-1-2016 e-paper
      • 10-1-2016 e-paper
      • 12-1-2016 e-paper
      • 13-1-2016 e-paper
      • 15-1-2016 e-paper
      • 17-1-2016 e-paper
      • 18-1-2016 e-paper
      • 19-1-2016 e-paper
      • 20-1-2016 E-paper
      • 21-1-2016 e-paper
      • 22-1-2016 E-paper
      • 23-1-2016 E-paper
      • 24-1-2016 E-paper
      • 26-1-2016 e-paper
      • 27-1-2016 e-paper
      • 28-1-2016 e-paper
      • 29-1-2016 e-paper
      • 30-1-2016 e-paper
      • 31-1-2016 e-paper
    • ►  February (24)
    • ►  March (28)
    • ►  April (25)
    • ►  May (28)
    • ►  June (26)
    • ►  July (28)
    • ►  August (30)
    • ►  September (30)
    • ►  October (27)
    • ►  November (27)
    • ►  December (27)
  • ►  2017 (320)
    • ►  January (27)
    • ►  February (27)
    • ►  March (26)
    • ►  April (29)
    • ►  May (26)
    • ►  June (27)
    • ►  July (26)
    • ►  August (28)
    • ►  September (25)
    • ►  October (26)
    • ►  November (26)
    • ►  December (27)
  • ►  2018 (306)
    • ►  January (26)
    • ►  February (25)
    • ►  March (27)
    • ►  April (26)
    • ►  May (26)
    • ►  June (25)
    • ►  July (25)
    • ►  August (25)
    • ►  September (25)
    • ►  October (25)
    • ►  November (28)
    • ►  December (23)
  • ►  2019 (307)
    • ►  January (25)
    • ►  February (25)
    • ►  March (27)
    • ►  April (25)
    • ►  May (25)
    • ►  June (26)
    • ►  July (25)
    • ►  August (26)
    • ►  September (25)
    • ►  October (26)
    • ►  November (26)
    • ►  December (26)
  • ►  2020 (322)
    • ►  January (25)
    • ►  February (26)
    • ►  March (25)
    • ►  April (26)
    • ►  May (27)
    • ►  June (25)
    • ►  July (27)
    • ►  August (30)
    • ►  September (30)
    • ►  October (28)
    • ►  November (26)
    • ►  December (27)
  • ►  2021 (287)
    • ►  January (26)
    • ►  February (25)
    • ►  March (26)
    • ►  April (21)
    • ►  May (23)
    • ►  June (12)
    • ►  July (27)
    • ►  August (25)
    • ►  September (27)
    • ►  October (26)
    • ►  November (24)
    • ►  December (25)
  • ►  2022 (113)
    • ►  January (25)
    • ►  February (25)
    • ►  March (25)
    • ►  April (25)
    • ►  May (13)

Click here to Contact Us

Click here to Contact Us

Onlinebits.net | Exams Platform |

Onlinebits.net | Exams Platform |
online examination tool

Water Purifiers

Water Purifiers
Voodayam. Simple theme. Powered by Blogger.