Jaathiyam

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాు ప్రారంభం


 హైదరాబాద్‌ :    ఫిబ్రవరి 23  (ఎ.ఎం.ఎస్‌) : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ప్రసంగం ప్రారంభించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రణబ్‌ గుర్రపుబగ్గీలో పార్లమెంటుకు చేరుకున్నారు. హెచ్‌.సి.యు, జే.ఎన్‌.యు సహా పు అంశాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిదీసేందుకు ప్రతిపక్షాు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు, అన్ని బ్లిుు ఆమోదింపజేసుకుంటామన్న ధీమాతో కేంద్రం ఉంది. బడ్జెట్‌ సమావేశాకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని ప్రధాని విపక్షాకు విజ్ఞప్తి చేశారు.  అభివృద్ధియే ప్రధాన అజెండాగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాను ప్రారంభించిన సందర్భంగా ఉభయ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాు వాటి పనితీరును వివరించారు. భవిష్యత్‌ లో ఎలాంటి విజన్‌ తో ముందుకు వెళ్తామన్న దానిపై ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా ప్రణబ్‌ ప్రసంగించారు. అందరి అభివృద్ధి కోసం అందరినీ కుపుకొని పోతామని చెప్పారు. సంక్షేమ పథకాు, సామాజిక భద్రత పథకాు ప్రజకు ఎంతో మేు చేస్తాయమని చెప్పారు. రైతు, యువత సహా సమాజంలో అన్ని వర్గాకు న్యాయం చేయటమే తమ క్ష్యమన్నారు.పేదరికాన్ని నిర్మూలించేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాని పిుపునిచ్చారు. కేంద్రంలో పు మంత్రిత్వ శాఖు చేపట్టిన పథకాను వివరించారు. వాటి ద్వారా ఏ విధమైన ప్రయోజనం దక్కిందో చెప్పారు. భవిష్యత్‌ లోనూ ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తామన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదం భారత్‌ సహా పు దేశాకు సవాల్‌ గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు అన్ని దేశాు ముందుకు రావాల్సిన అవసరముందని పిుపునిచ్చారు. ఇక ప్రపంచంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ద్రవ్య్బోణాన్ని నివారించి వృద్ధి రేటు పెరిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రసంగానికి ముందు రాష్ట్రపతి భవన్‌ నుంచి సాంప్రదాయ బద్దంగా ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంట్‌ కు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ,ప్రధాని మోడీ, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆయనకు వీడ్కోు పలికారు.


ఓ వ్యాసం బాలిక జీవితాన్నే మార్చేసింది !

కోల్‌కతా: పిల్లల జీవితాలను టీచర్లు చక్కదిద్దుతారన్న మాటను నిజం చేసే ఓ సంఘటన కోల్‌కతాలో వెలుగుచూసింది. కుటుంబంపై ఓ వ్యాసర రాయమని ఓ టీచరు పిల్లలకు సూచించారు. మరునాడు పిల్లలంతా వ్యాసం రాసుకొచ్చారు. అయితే ఓ పదేళ్ల బాలిక రాసిన వ్యాసం మాత్రం టీచరు కంట నీరుపెట్టించింది. 'మా నాన్న చెడ్డవాడు. రోజూ అమ్మను కొడుతుంటాడు. రాత్రైతే చాలు అమ్మ ఏడు స్తూ ఉంటుంది. నన్నూ దారుణంగా కొడతాడు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మా కుటుంబ సభ్యులంతా చూసిచూడనట్లు ఉండిపోతారు. పెద్దయ్యాక అమ్మను నాన్న నుంచి దూరంగా తీసుకెళ్లి బాగా చూసుకుంటాను' అంటూ ఆ బాలిక వ్యాసం రాసుకెళ్లింది. ఇది చూసిన ఉపాధ్యాయురాలు విషయాన్ని ప్రిన్సిపల్‌ దృష్టికి తీసు కెళ్లారు. ప్రిన్సిపల్‌ కూడా వెంటనే స్పందించి పాఠశాల కౌన్సిలర్‌తో చర్చించారు. బాలిక తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. తన పద్ధతి మార్చుకోకపోతే భార్యాబిడ్డలకు దూరంగా ఉండాలని పాప తండ్రికి హితవు పలికారు. బాలిక తనపై పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మారాల్సిందేనని అతనికి సూచించారు. ప్రిన్సిపల్‌ చర్యతో ఆ తండ్రిలో నెమ్మదిగా మార్పువచ్చింది. పాపలో ఆత్మవిశ్వాసం పెరిగింది. చిన్నపిల్ల ఏదో రాసిందని వదిలేయకుండా సమస్యను పరిష్కరించటంతో టీచరు, ప్రిన్సిపల్‌ చొరవ చూపడం అభినందనీయం.

No comments:

Post a Comment