Cinema


నేనే అసు సిసలైన రౌడీనని

సినిమా (ఎ.ఎం.ఎస్‌) : దేవుడంటే తనకు భయం లేదని, తానే ఒక దేవుడిని వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెలిపారు. యముడు తన గొంతుపై కత్తి పెట్టినా అన్నమయ్య వంటి సినిమా తీయలేనని రామ్‌ గోపాల్‌ వర్మ వ్లెడిరచారు. తన సినిమాల్లో హీరోయిన్లను బట్టు లేకుండా చూపించేందుకే ఎక్కువ ఖర్చు పెడతానంటూ చెప్పారు. మహాభారతంలో జరిగిన హింస కంటే విజయవాడలో జరిగిన హింసే ఎక్కువని వర్మ సెన్సేషనల్‌ వ్యాఖ్యు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్‌ యూనివర్శిటీలో విద్యార్థుతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థు అడిగిన పు ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అయితే ‘విజయవాడకు రావద్దంటూ కొందరి నుంచి బెదిరింపు వస్తున్నాయని.. ఆనాటి రౌడీతో తిరిగిన నేనే అసు సిసలైన రౌడీనని, దమ్ముంటే నన్ను అడ్డుకోండంటూ’ ప్రయాణం వివరాను ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

 పాటు మార్చ్‌ 1న ‘ఊపిరి’  పాటు 

సినిమా (ఎ.ఎం.ఎస్‌) : నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఊపిరి’ (తమిళంలో ‘థోజా’). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గోపిసుందర్‌ సంగీత దర్శకుడు. పీవీపి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పాటు మార్చ్‌ 1న విడుదవనున్నాయి. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఇందుకు వేదిక కానుంది. మార్చ్‌ 25న తెరవిూదికి రానున్న ఈ సినిమాలో అడివి శేష్‌, అనుష్క, శ్రేయ తదితయి అతిథి పాత్రల్లో కనపడనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ పాటు సూర్య చేతు విూదుగా నిన్న విడుదయ్యాయి.జయసుధ, ప్రకాష్‌రాజ్‌, క్పన, ఆలీ, తనికెళ్ళ భరణి తదితయి కీక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంగీతం: గోపీసుందర్‌, పాటు: సిరివెన్నె సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, స్వె, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, స్మాన్‌, హరి, మాటు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతు: పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

'ప్రేమమ్‌' ఫస్ట్‌ లుక్‌


(ఎ.ఎం.ఎస్‌)సినిమా :'కార్తికేయ' వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'సితార సినిమా' పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రేమమ్‌. అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడొన్నా సెబాస్టియన్‌ లు నాయకా,నాయికలు. ఈ చిత్రానికి ' ప్రేమమ్‌' అనే పేరును నిర్నయించామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. 'ప్రేమమ్‌' తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన సందఠంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్‌, చందు మొండేటి ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేమతో కూడిన సంగీత భరిత ద శ్య కావ్యం. ఇప్పటివరకు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ' ప్రేమమ్‌' ను సమ్మర్‌ స్పెషల్‌ గా విడుదల చేయనున్నామని తెలిపారు. దర్శకుడు 'చందు మొండేటి' మాట్లాడుతూ .. ' ప్రేమమ్‌' చిత్రానికి ఉప శీర్షిక (ాకూశీఙవ ర్‌శీతీఱవర వఅసౌ ఖీవవశ్రీఱఅస్త్రర ణశీఅ్ణ్‌ౌ)  'ప్రేమ కధలకు ముగింపు ఉంటుంది కానీ.. అనుభూతులకు ఉండదు'. కధానాయకుడు అక్కినేని నాగచైతన్య పాత్ర మూడు వైవిధ్యమైన కోణాల్లో కనిపిస్తుంది. ఆ మూడూ ఒకదానికొకటి పాత్రోచితంగా భిన్నంగా సాగుతూ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ' ప్రేమమ్‌' మూడు ప్రేమ కధల సమ్మిళితం. ప్రతి కధ ఎంతో నవ్యతను కలిగి ఉంటుంది. ఆ కధలకు 'శ్రుతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడొన్నా సెబాస్టియన్‌' లు ఎంతగానో నప్పారు. 'అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్‌' ల జోడి ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ' ప్రేమమ్‌' ను తెలుగులో చేయాలని నిర్నయించుకున్నప్పుడు మన తెలుగు వాతావరణానికి తగినట్లుగా కధలో పలు మార్పులు చేసినట్లు దర్శకుడు 'చందు మొండేటి' తెలిపారు. చిత్రంలోని ఇతర తారాగణం జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్‌, చైతన్యకష్న, అరవింద్‌ క ష్న,సత్య, కార్తీక్‌ ప్రసాద్‌, నోయల్‌, ఈశ్వర్‌ రావు,జోగి నాయుడు, కష్నంరాజు. ఈ చిత్రానికి సంగీతం: గోపిసుందర్‌, రాజేష్‌ మురుగేషన్‌, :చాయా గ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని: ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు:ఆర్ట్‌: సాహి సురేష్‌: ఫైట్స్‌ : అనల్‌ అర్స్‌:ఒరిజినల్‌ స్టోరి: ఆలోాన్సెే పుధరిన్‌:సమర్పణ: పి.డి.వి. ప్రసాద్నిర్మాత:సూర్యదేవర నాగవంశీ:స్క్రీన్‌ప్లే,మాటలు ,దర్శకత్వం: చందుమొండేటి

---------------------------------------------------------------------------------------------------------------------------------
 'రుద్రాక్ష' తొ మల్లి ఫాం లొకి

(ఎ.ఎం.ఎస్‌) సినిమా : సినిమా సినిమాకూ వైవిధ్యం చూపించేవాడు కాబట్టే.. ఒకప్పుడు క ష్నవంశీని అందరూ క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనేవాళ్లు. కానీ 'మురారి' దగ్గర్నుంచి ఒక తరహా ఫ్యామిలీ టైపు సినిమాలే చేస్తూ రావడంతో జనాలకు మొనాటనీ వచ్చేసింది. 'మొగుడు' ఆయన కెరీర్‌ను చాలా చాలా దెబ్బ తీసింది. 'గోవిందుడు అందరివాడేలే'తో మళ్లీ ఉనికిని చాటుకున్నప్పటికీ.. అది క ష్నవంశీ లాంటి డైరెక్టర్‌ తీయాల్సిన సినిమా అయితే కాదు. ఐతే క ష్నవంశీ ఇప్పుడు మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాలని పట్టుదలగానే ఉన్నట్లున్నాడు. దిల్‌ రాజు లాంటి ప్రొడ్యూసర్‌ను మెప్పించి భారీ బడ్జెట్‌ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడంటే.. క ష్నవంశీ ఈసారి తన ముద్ర చూపిస్తాడనే అనుకోవచ్చు.

తన కొత్త సినిమా 'క ష్నాష్టమి' రిలీజ్‌ నేపథ్యంలో ఇంటర్వ్యూలిస్తూ.. క ష్నవంశీ సినిమా విశేషాలు చెప్పాడు రాజు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని.. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని.. తర్వాత హిందీలోకి కూడా డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తామని వెల్లడించాడు రాజు. ఇదొక విజువల్‌ వండర్‌ అని, క ష్నవంశీ అంటే ఏంటో చూపిస్తుందని చెప్పాడు. 'రుద్రాక్ష' అని టైటిల్‌ వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా టైటిల్‌ ఏమీ ఫైనలైజ్‌ చేయలేదని  చెప్పాడు. సినిమాలో 40 నిమిషాలకు పైగా గ్రాఫిక్స్‌ ఉంటాయని కూడా తెలిపాడు. ఈ సినిమాలో అనుష్క, సమంత, రమ్యక ష్న ముఖ్య పాత్రలు పోషించబోతుండటం విశేషం. దీని బడ్జెట్‌ రూ.30 కోట్లకు పైనే అంటున్నారు. 

----------------------------------------------------------------------------------------------------------------------------------
కోలివుడ్‌ లొ క్రికెట్‌ సందడి

(ఎ.ఎం.ఎస్‌) సినిమా : ఇండియాలో ఉన్నవి రెండే రిలీజియన్లు. ఒకటి సినిమా.. మరొకటి క్రికెట్‌. ఈ రెండూ కలిస్తే వచ్చే కిక్కే వేరు. ఇప్పటికే ఈ ఫార్మాట్‌ లో వచ్చిన సిసిఎల్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. దాంతో సినిమా వాళ్లకు ఎలాంటి అవసరం కావాలన్నా.. క్రికెట్‌ కే ముందు ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడు తమిళ హీరోలు కూడా ఇదే చేయబోతున్నారు. తమ నడిగర్‌ సంఘం(తమిళ ఇండస్ట్రీ సినీ ఫెడరేషన్‌)కు ఓ బిల్డింగ్‌ కట్టించాలనేది ప్రస్తుతం జనరల్‌ సెక్రటరీ విశాల్‌ కల. అది పూర్తైతే గానీ పెళ్లి కూడా చేసుకోనని పంథం పట్టాడు విశాల్‌. మొన్న నడిగర్‌ సంఘం ఎలక్షన్స్‌ లో విశాల్‌ గెలవడానికి ప్రధాన కారణం కూడా ఈ బిల్డింగ్‌ ఇష్యూనే.

ఇప్పుడు చెప్పినట్లుగానే బిల్డింగ్‌ పనులు మొదలుపెట్టారు తమిళ నటులు. అయితే వీళ్ల దగ్గర నడిగర్‌ సంఘం పేరు మీద 48 లక్షలే ఉన్నాయి. కానీ బిల్డింగ్‌ కు రెండు కోట్లు కావాలి. స్టార్‌ హీరోల్లో ఎవ్వరికీ అది పెద్ద అమౌంట్‌ కాదు. కానీ కేవలం సినిమా వాళ్ల డబ్బుతోనే ఆ పని చేయాలనేది విశాల్‌ ఆశ. అందుకే ఆ 2 కోట్లు అప్పుగా తీసుకొచ్చారు నడిగర్‌ సంఘం సభ్యులు. ఇప్పుడు ఆ అప్పు తీర్చే భారం తమిళ నటులందరిపైనా ఉంది. దాంతో ఓ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడబోతున్నారు అరవ హీరోలు.

ఇందులో టాప్‌ స్టార్స్‌ అంతా ఆడతారు. రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌ సైతం మ్యాచ్‌ ఆడటానికి సిద్ధమవుతున్నారు. ఎప్రిల్‌ 10న ఈ మ్యాచ్‌ ఆడనున్నారు. ఇందులో రెండు టీం లు ఉండబోతున్నాయి. అయితే రజినీ, కమల్‌ చెరో టీం లో ఉంటారో.. లేదంటే ఒకే టీంలో ఆడతారా అనే విషయంపై క్లారిటీ రాలేదు. విజయ్‌, అజిత్‌ లాంటి సూపర్‌ స్టార్స్‌ ను సైతం క్రికెట్‌ మ్యాచ్‌ లో ఆడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్లంతా ఏకమైన మ్యాచ్‌ ఆడితే.. 2 కోట్లేం ఖర్మ ఏకంగా ఐదారు కోట్లు నడిగర్‌ సంఘం ఖాతాలో పడిపోతాయి.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 ప్తిగా కలుసుకుని జీవిస్తే అంతకు మించి సంతోషం ఏముంటుంది(ఎ.ఎం.ఎస్‌) సినిమా : బాలీవుడ్‌ అందాల ముద్దుగుమ్మ పరిణితి చోప్రా బోల్డ్‌గా మాట్లాడే ముద్దుగుమ్మలు ఒకరుగా పేరు తెచ్చుకున్నది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే ఎక్స్‌పోజింగ్‌కు ఎంతమాత్రం వెనక్కి తగ్గరు. అదేమని అడిగితే పాత్ర డిమాండ్‌ చేసింది కాబట్టి చూపించేశానని చెప్తుంటారు. ఎక్స్‌పోజింగ్‌ సంగతి ప్రక్కనబెడితే... ఈ ముద్దుగుమ్మ ఈమధ్య ఎఫైర్లు, సహజీవనం గురించి మాట్లాడింది. ఈమె చెప్పిన డేటింగ్‌ ఫార్ములా కాస్తంత భిన్నంగా ఉంది. 

మనసుకు నచ్చినోడు కనిపిస్తే ఒకే ఇంట్లో కలిసి ఉంటేనే సహజీవనం కాదనీ, దూరం దూరంగానే ఉంటూనే వారానికి నాలుగైదు గంటలు త ప్తిగా సంతోషంగా గడిపినా చాలంటోంది. దగ్గరగా ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఒకరికొకరు తప్తికరంగా గడపలేనప్పుడు కలిసి ఉండి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తోంది. కనుక ఎవరింట్లో వారున్నప్పటికీ వారంలో నాలుగైదు సార్లు త ప్తిగా కలుసుకుని జీవిస్తే అంతకు మించి సంతోషం ఏముంటుంది అంటోంది. అన్నట్లు ఈ అమ్మడికి ఎఫైర్లు ఉన్నాయని బాలీవుడ్‌ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నప్పటికీ తనకు ఎవరితోనూ ఎలాంటి ఎఫైర్లు లేవని తేల్చి చెపుతోంది.


No comments:

Post a Comment